‘శీనన్న వచ్చాకే అభివృద్ధి కనిపించింది’.. కాంగ్రెస్‌లో చేరిన 50 కుటుంబాలు.
ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర : ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, సీపీఎం సహా వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా తమ ప్రాంతంలో జరగని అభివృద్ధి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చొరవతో సాధ్యమవుతోందని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, పొన్నేకల్ గ్రామంలో ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి నిర్ణయాలు తమను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయని తెలిపారు.

గ్రామానికి, ప్రాంతానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రాయల సైదులు, మారపొంగు నరేష్, సిరిపల్లి లక్ష్మయ్య, గార్లపాటి ఉపేందర్, వరగాని ఉపేందర్ కుటుంబాలతో పాటు సుమారు 50 కుటుంబాల సభ్యులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, మద్ది వీరారెడ్డి, ముత్యం చిన్ని కృష్ణారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటి రమణ, పొన్నేకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు వంగూరి రవి, లింగా శ్రీనివాస్, గునిగంటి రమేష్, తేళ్లపూడి శ్రీనివాస్, వరగాని శ్రీనివాస్, కోట వెంకటేశ్వర్లు, పొన్నేకంటి ఉపేందర్, పెద్దపొంగు ఉపేందర్, మోరు రమేష్, మురకొండ వెంకటేశ్వర్లు, వరగాని నాగేశ్వరరావు, బొడ్డు హనుమంతు, కొత్తా గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
