రూ.3 కోట్ల అభివృద్ధి పనులను పరిశీలించిన సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్.
రోడ్లు, డ్రైనేజీ పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు.
ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర:- ఖమ్మం నగరంలోని పాండురంగాపురం (డివిజన్-02), బల్లేపల్లి (డివిజన్-03), లోటస్ హిల్స్ (డివిజన్-16) ప్రాంతాల్లో సుడా నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ మూడు డివిజన్లలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలు, అమలు వేగంపై ప్రత్యేక దృష్టి సారించిన చైర్మన్, పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు ఎస్‌ఈ రంజిత్, కృష్ణలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధరణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాకూబ్ వలి, అసిస్టెంట్ ఇంజినీర్ తేజాతో కలిసి పనుల వివరాలను సమీక్షించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు.
అలాగే ఆయా డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. నగర అభివృద్ధికి సుడా కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు.

