అధిక ధరలకు మద్యం విక్రయాలు.. ప్రశ్నించిన వినియోగదారులపై దురుసు ప్రవర్తన?

అధిక ధరలకు మద్యం విక్రయాలు.. ప్రశ్నించిన వినియోగదారులపై దురుసు ప్రవర్తన?

ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.

వర్ని ప్రతినిధి చందర్:- నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని ఓ వైన్స్ దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్థానిక వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

 

వినియోగదారుల కథనం ప్రకారం, దుకాణంలో మద్యం బాటిళ్లపై ముద్రించిన ధర కంటే అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించిన కొందరిపై దుకాణం యజమానులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, కొందరిని బెదిరించినట్లు కూడా సమాచారం.

 

 

అలాగే, దుకాణంలో ధరల పట్టికను సక్రమంగా ప్రదర్శించడం లేదని, వినియోగదారులకు బిల్లులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని వారు వాపోయారు.

 

 

ఈ నేపథ్యంలో సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, వైన్స్ దుకాణంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అధిక ధరల వసూళ్లు, వినియోగదారులపై దురుసు ప్రవర్తన, దాడుల అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై వైన్స్ దుకాణం యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది.