ఎస్ఐఆర్ ప్రక్రియకు సామగ్రి పంపిణీ బీఎల్ఓ లకు కిట్లు అందజేసిన ఆర్డీవో విజయ కుమారి.

ఎస్ఐఆర్ ప్రక్రియకు సామగ్రి పంపిణీ బీఎల్ఓ లకు కిట్లు అందజేసిన ఆర్డీవో విజయ కుమారి.

పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్లకు ఆదేశం.

బోధన్ ప్రతినిధి రాహుల్: ఎన్నికల సంఘం నుంచి బోధన్ నియోజకవర్గానికి కేటాయించిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన సామగ్రిని స్థానిక ఆర్డీవో ఎం. విజయ కుమారి , నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్ల కు పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన బిఎల్ఓ కిట్ బ్యాగ్‌లో బిఎల్ఓ, ల సూచిక, క్యూఆర్ కోడ్‌లతో కూడిన ట్రైనింగ్ మెటీరియల్ బ్రోచర్, ఎగ్జామ్ పాడ్, ఫారం 6, 7, 8 డిక్లరేషన్లు, రిజిస్టర్, నోట్ పాడ్, 3 పెన్నులు, ఫెవిస్టిక్, హైలైటర్, స్టాప్లర్, పిన్నులు, ఎరేజర్, షార్పనర్, పెన్సిల్ బాక్స్, స్కేల్ ఉన్నాయి.

 

 

అంతేకాకుండా బిఎల్ఓ , ల కోసం సి ఎఫ్ , పారాలు రైన్ కోట్, గొడుగు, టీ షర్ట్, ఫైల్ పాడ్‌ను కూడా ఎన్నికల సంఘం పంపింది. ఆర్డీవో విజయ కుమారి, బోధన్ తహసీల్దార్ పి. విఠల్‌తో కలిసి బోధన్ మండల ఎలక్షన్ సెల్ సిబ్బంది నాగమణి, సుశీల, అహమదుద్దీన్, ముస్తఫా సమక్షంలో బోధన్‌లోని 5 మండలాల తహసీల్దార్లకు ఈ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సామగ్రిని తక్షణమే బి ఎల్ ఓ., లకు అందజేసి ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగానిర్వహించాలని తహసీల్దార్లకు సూచించారు .బిఎల్ ఓ, లు ట్రైనింగ్ బ్రోచర్‌లోని క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వచ్చే సూచికల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్డీవో గారు తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎస్ఐఆర్, ప్రక్రియలో బిఎల్ ఓ , లతో పాటు తహసీల్దార్లు కూడా అప్రమత్తంగా ఉండి 5-10 ఇళ్లు తిరిగి ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తహసీల్దార్లు/ఏఈఆర్ఓ, లు తమ మండలంలోనే అందు బాటులో ఉండాలని, బిఎల్ ఓ. లకు, ప్రజలకు నిరంతరం సేవలు అందించాలని, ఎస్ఐఆర్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.