మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో ఘనంగా ఆషాఢ మాస బోనాల వేడుకలు.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని మిరాకిల్ మైండ్స్ స్కూల్‌లో ఆషాఢ మాస బోనాల పండుగను సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాలతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణ పండుగ శోభను సంతరించుకోగా, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వినోద్ మాట్లాడుతూ, బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, భావితరాలకు మన ఆచారాలు, సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.
