బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
బోధన్ ప్రతినిధి రాహుల్:- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీమతి విజయ కుమారి కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఫలించి స్వరాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి, ప్రజాప్రతినిధి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.
