బోధన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

బోధన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

బోధన్  ప్రతినిధి రాహుల్ :-  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. రైల్వే కమాన్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ అధ్యక్షత వహించారు.

 

 

 

ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొలిపాక రేణుక-బాలరాజు, రాజుల దేవి, లక్ష్మీ పూజిత పవన్, గుంత అబ్బవ, గుంత గంగాధర్, మాజీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, బీజేవైఎం అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్‌తో పాటు దుర్గాప్రసాద్, చరణ్, చింటూ, శ్రీనివాస్, వినయ్, అడ్లూరి ఫణి, లోశ్రీ అనిల్, కనిగంటి ఫణీంద్ర, బిల్లా విజయ్, కస్పలింగం భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.