బోధన్‌లో అక్రమ దుకాణాల తొలగింపుపై బీజేపీ మెమోరాండం.
పక్షపాతం లేకుండా అన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి: పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్.
బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు మంగళవారం మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అధికారులు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ కొంతమంది దుకాణదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపడితే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని అక్రమ దుకాణాలపై పక్షపాతం లేకుండా ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
మెమోరాండంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సమస్యను పూర్తిస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొలిపాక రేణుక బాలరాజు, రాజుల దేవి లక్ష్మీ పూజిత పవన్, గుంత అబ్బవ, గుంత గంగాధర్, మాజీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, బీజేవైఎం అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, దుర్గాప్రసాద్, చరణ్, చింటూ, శ్రీనివాస్, లోశ్రీ అనిల్, బిల్లా విజయ్, కస్పలింగం భీమ్రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
