తెలంగాణ తల్లి, అమరవీరులకు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఘన నివాళి.
బోధన్ ప్రతినిధి రాహుల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మిసాలే నాగేష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మిసాలే నాగేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అమరవీరుల ఆశయాల సాధనకు విద్యార్థి లోకం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, టౌన్ కార్యదర్శి వీరేశ్, విశాల్, రాజ్ రథన్ తదితరులు పాల్గొన్నారు.
