ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బీజేపీ ప్రత్యేక పూజలు.

ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బీజేపీ ప్రత్యేక పూజలు.

బోధన్ పెద్ద హనుమాన్ మందిర్‌లో బీజేపీ పట్టణ శాఖ కార్యక్రమం.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:- భారతదేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిర్‌లో వేద పండితులు ప్రవీణ్ మహరాజ్ చేతుల మీదుగా ప్రధాని మోదీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ, మూడోసారి ప్రధానిగా ఎన్నికై నరేంద్ర మోదీ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారని పేర్కొన్నారు. దేశాన్ని దీర్ఘకాలంగా పాలిస్తున్న ప్రధానిగా మోదీ సుపరిపాలన అందిస్తున్నారని ఆయన అన్నారు.

 

 

వ్యవసాయం, ఆర్థిక, రక్షణ, రవాణా రంగాల్లో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. విశ్వకర్మ యోజన, ముద్ర లోన్స్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, వందే భారత్ రైళ్లు, ప్రధాన మంత్రి సడక్ యోజన వంటి పథకాల ద్వారా సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ నిషేధం, నల్లధనం నియంత్రణ, ఉగ్రవాద నిరోధం, సరిహద్దు భద్రత వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.

 

 

“ఎలాంటి అవినీతి లేకుండా, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో నిమగ్నమైన నాయకుడిగా మోదీ వందేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించాము” అని ఆయన తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలీపాక బాలరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, హనుమాన్లుచారి, గుంత గంగాధర్, పేరుక వెంకటేష్, కార్యదర్శి స్వప్నిల్, శ్రీను, వినోద్, వినయ్, పడాల శ్రీను, కిరణ్, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, రాజు, సన్నీ, కనీగంటి ఫణీంద్ర, రాము తదితరులు పాల్గొన్నారు.