రుద్రూర్ నూతన ఎస్సై మనోజ్ కుమార్‌కు బీజేపీ నాయకుల ఘన సన్మానం.

రుద్రూర్ నూతన ఎస్సై మనోజ్ కుమార్‌కు బీజేపీ నాయకుల ఘన సన్మానం.

ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్ట పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్న ఎస్సై.

రుద్రూర్ ప్రతినిధి చందర్:- 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బదిలీపై వచ్చిన ఎస్సై మనోజ్ కుమార్‌ను సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

 

 

ఈ సందర్భంగా బీజేపీ రుద్రూర్ మండల కార్యదర్శి తాటి సాయికుమార్ ఎస్సై మనోజ్ కుమార్‌కు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని కోరారు.

 

 

అనంతరం ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్ట పరిరక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో పోలీస్-ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వినోద్, సత్తయ్య, గంగారం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.