చింతకాని రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్ నాయకుల పిలుపు.

చింతకాని రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి: కాంగ్రెస్ నాయకుల పిలుపు.

తల్లాడలో సన్నాహక సమావేశం.. సభ పోస్టర్ ఆవిష్కరణ.

నవగీతం ప్రతినిధి తల్లాడ: ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించనున్న **’రైతు ఆశీర్వాద సభ’**ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం తల్లాడలోని జీఎన్‌ఆర్ గార్డెన్‌లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

 

 

 

ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మండల ఇన్‌చార్జ్ గంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

 

 

 

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి రైతులు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో చింతకాని సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పమ్మి అశోక్, దొబ్బల సౌజన్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.