పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బోధన్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం బోధన్ డివిజన్ కార్యదర్శి జె. శంకర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం భారాలు మోపుతూ దేశభక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

 

 

దేశభక్తి అంటే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడమేనా అని ప్రశ్నించిన ఆయన, ఒకవైపు ప్రజల ఆదాయాలు తగ్గిపోతుండగా మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

 

 

 

రామభక్తులమని చెప్పుకుంటూ ప్రజలపై భారాలు మోపడం సరికాదని, రైతుల నుంచి తక్కువ ధరలకు పంటలు కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

అలాగే ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు ప్రభుత్వ విధానాలను గమనించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో పత్రి ఎల్లయ్య, జంగం గంగాధర్, పేట పోశెట్టి, కదిరే అర్జున్, నాగలక్ష్మి, సుమలత తదితరులు పాల్గొన్నారు.