వర్ని మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
వర్ని ప్రతినిధి చందర్ :- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్ని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జి. వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
కార్యక్రమంలో ఎంపీఓ బి. మారుతి, పీఆర్ ఏఈ వై. సాయిలు, ఏపీఓ హేమలతతో పాటు మండల కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ వేడుకలు దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవ భావాలతో ఉత్సాహంగా సాగాయి.

