తెలంగాణ అమరవీరులకు సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ ఘన నివాళి.

తెలంగాణ అమరవీరులకు సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ ఘన నివాళి.

అమరుల ఆకాంక్షల సాధనకై పోరాటమే నిజమైన నివాళి: బి. మల్లేష్.

బోధన్ ప్రతినిధి రాహుల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ దీక్షా స్థల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.

 

 

 

ఈ సందర్భంగా పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పాలక పార్టీలు పూర్తిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో నిర్లక్ష్యం చూపిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు, పింఛన్లు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఆశించిన పురోగతి సాధించలేదన్నారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఉచిత విద్య, వైద్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసం నిరంతర పోరాటాలు కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు సీహెచ్ రమేష్, టి. దేవయ్య, ఏఐయుకేఎస్ నాయకులు బి. సాయిలు, డి. పోశెట్టి, గంగారాం, టీయూసీఐ నాయకులు మక్కయ్య, కాజా, సలీం, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.