నూతన ఎస్సై సునీల్‌కు దళిత కళ్యాణ్ సమితి ఘన సత్కారం.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సునీల్‌ను దళిత కళ్యాణ్ సమితి వర్ని చౌరస్తా శాఖ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఎస్సై సునీల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం దళిత కళ్యాణ్ సమితి వర్ని చౌరస్తా శాఖ అధ్యక్షుడు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో టి. రాజు, డబ్ల్యూ. అశోక్, సీమ గంగాధర్, కె. రాజేందర్, ఆర్టీసీ గంగారాం, కండక్టర్ గంగాధర్, ఎ. శివాజీ, కె. అజయ్, వికాస్, సాయి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
