మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు.

మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు.

బాన్సువాడ ప్రతినిధ విశ్వంబార్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల విస్తరణ, దేశ భద్రత బలోపేతం, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను పెంపొందించడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

 

 

 

గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణాత్మక నిర్ణయాలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశాయని ఆయన అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉంటూ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

 

 

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, వార్డు కౌన్సిలర్ గజ్జల మహేష్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, గుడుగుంట్ల శ్రీనివాస్, చీకట్ల రాజు, చంద్రశేఖర్ గౌడ్, పాశం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారాం, ప్రదీప్, మహేందర్, మండల ప్రధాన కార్యదర్శి దత్తు, సుధాకర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.