బాన్సువాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన.

బాన్సువాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన.

సిద్దపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన – జాకోర-చందూర్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర-చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.

 

 

 

ఉదయం 11.25 గంటలకు వర్ని మండలంలోని సిద్దపూర్ రిజర్వాయర్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రికి ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గిరిజన మహిళలు సంప్రదాయ పద్ధతిలో పూలతో స్వాగతం తెలపగా, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. మంత్రి రాకతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

అనంతరం మంత్రి సిద్దపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

మధ్యాహ్నం 12 గంటలకు రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర-చందూర్ ఎత్తిపోతల పథకాన్ని మెయిన్ స్విచ్ ఆన్ చేసి మంత్రి అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రాంతీయ రైతులకు సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇన్‌చార్జి సీపీ రాజేష్ చంద్ర, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.