పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
తల్లాడ ప్రతినిధి దేవల్ల ఉపేంద్ర :- తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్లను సత్తుపల్లి ఎమ్మెల్యే Dr. Matta Ragamayi Dayanand ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన నివాసం అవసరమని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

తల్లాడ మండలంలో ఎమ్మెల్యే భారీ కాన్వాయ్‌తో పర్యటించగా స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

