ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.

ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

బోధన్ ప్రతినిధి రాహుల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లక్ష గృహప్రవేశాల కార్యక్రమం బుధవారం బోధన్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. శక్కనగర్ వార్డులో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలను ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అన్నారు.

గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయ్ కుమారి, ఎమ్మార్వో విట్టల్, మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, బోధన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకుదాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, మైనార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మొహినుద్దీన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.