కవితక్క ఇంట్లో బాన్సువాడ నాయకుల తెలంగాణ దినోత్సవ సంబరాలు.

కవితక్క ఇంట్లో బాన్సువాడ నాయకుల తెలంగాణ దినోత్సవ సంబరాలు.

 

బాన్సువాడ ప్రతినిధి విశ్వంబార్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని టీఆర్‌ఎస్ చీఫ్ కవిత ఇంట్లో బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మామిండ్ల రాజు నాయకత్వంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయగా, అనంతరం కవితకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

ఈ సందర్భంగా మామిండ్ల రాజు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమకారులకు, అలాగే రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. మన భాష, మన యాసతో గర్వంగా నిలిచిన ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.